Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిరాణా షాపు వ్యక్తి నేపథ్యంలో నమస్తే సేట్‌ జీ

Saikrishna, Swapna Chaidari
, మంగళవారం, 6 డిశెంబరు 2022 (21:41 IST)
Saikrishna, Swapna Chaidari
వాస్తవిక స్థితిగతులే కథాంశంగా సినిమా రూపొందించడం దర్శకుడికి సాహాసమే అయినప్పటికీ  ప్రయత్నంలో లభించే సంతృప్తి మరెక్కడా దొరకదని సినీ హీరో యువ దర్శకుడు తల్లాడ సాయిక్రిష్ణ తెలిపారు. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా కిరాణాషాపు యజమానులు కూడా విశేష సేవలందించారు, కానీ సమాజం వారిని గుర్తించలేకపోయింది. ఒక కిరాణా షాపు వ్యక్తి నేపథ్యంలో ‘‘నమస్తే సేట్‌జీ’’ అనే సినిమాను నిర్మించామని ఆ సినిమా హీరో, దర్శకులు తల్లాడ సాయిక్రిష్ణ తెలిపారు.

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్‌ బ్యానర్‌ పైన నిర్మించిన నమస్తే సేట్‌ జీ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. ఇందులో తల్లాడ సాయిక్రిష్ణ, స్వప్నా చైదరి అమ్మినేని ముఖ్యతారాగణంగా నటించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌ వేదికగా మంగళవారం నమస్తే సేట్‌ జీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్య్రమానికి ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మహాంకాళీ దివాకర్‌లు ముఖ్య అతిథులుగా హాజరై వీడియో సాంగ్, ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా హీరో తల్లాడ సాయిక్రిష్ణ మాట్లాడుతూ కరోనా సమయంలో తనను కలచి వేసిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తీసానని, కరోనా ఆంక్షలున్న సమయంలో మారుమూల గ్రామాల్లో కిరాణా షాపు యజమానులు అందిచిన సహాకారం ఎనలేనిదని అన్నారు. ఈ సినిమాలో మాట్లాడే కెరెరా అనే కనిపించని క్యారెక్టర్‌ ఉందని, సినిమా చూసి ఆ కెమెరా పేరును తెలిపిన మొదటి పది మందికి ఒక్కొక్కరికీ పది వేల విలువ చేసే బహుమతులు అందించనున్నామని అన్నారు. గతంలో స్వీయ దర్శకత్వంలో ఎందరో మహానుభావులు, బ్లాక్‌బోర్డ్‌ అనే సినిమాలను తీసిన సినిమాలకు మంచి ఆదరణ అభించిందిన, ఈ సారి సందేశాత్మక చిత్రంగా నమస్తే సేట్‌జీ రూపొందించానని అన్నారు. తన ప్రయాణంలో వెంటుండి ప్రోత్సాహాన్ని అందిస్తున్న తనికెళ్ల భరని, తుమ్మలపల్లి రామసత్యనారాయణలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఊహించని స్పందన లభించిందని, అప్‌కమింగ్‌ సినిమా ఆర్టిస్టులకు ఇంతటి ప్రేక్షకాదరణ లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మసూద పాత్రను పోషించింది.. ఎవరో తెలుసా?