పోలీస్ కథలు చాలా వచ్చాయి. కొన్ని వారి లోపాలను ఎత్తి చూపితే మరికొన్ని పాజిటివ్ గా చూపాయి. ఇంకొన్ని వారు గర్వపడేలా ఉన్నాయి. అలాంటి తరహాలో కస్టడీ రాబోతుంది. అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ కస్టడీ ఈ ఏడాది విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా మ్యూజిక్ జర్నీమొదలుపెట్టారు.
ఫస్ట్ సింగిల్ హెడ్ అప్ హై లిరికల్ వీడియో ఇప్పుడు విడుదలైంది. లెజెండరీ కంపోజర్ ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హెడ్ అప్ హై థంపింగ్ బీట్‌లు, పవర్ ఫుల్ లిరిక్స్ మాస్ కాంబో. ఈ పాట పోలీసులకు ఘనమైన ట్రిబ్యుట్.
అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్‌లతో పాటు యువన్ శంకర్ రాజా స్వయంగా పాడిన ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. పాట మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంది. సాహిత్యం పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తుంది.
నాగ చైతన్య తన గ్రేస్ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో పాటలోని ఎనర్జీని మ్యాచ్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నిస్సందేహంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్‌ఆర్ కతీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ , డివై సత్యనారాయణ ఆర్ట్ డైరెక్టర్. కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కానుంది.
తారాగణం: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరేన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు