Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్.టి.ఆర్. దేవర గురించి వచ్చే వార్తలపై కొరటాల శివ ఫైర్

Advertiesment
Koratala Shiva

డీవీ

, మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (16:20 IST)
Koratala Shiva
ఎన్.టి.ఆర్. సినిమా అనగానే ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ప్రచారంలో భాగంగా ట్రైలర్ ను విడుదల చేస్తే అది సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. దేవరలో తండ్రీ కొడుకులుగా ఎన్.టి.ఆర్. నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా గతంలో వచ్చిన ఆంధ్రావాలాతో పోలుస్తూ పలువురు సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద రాద్దాంతం అయింది. ఇందుకు దేవర ఫంక్షన్ కూడా హైదరాబాద్ లో రద్దు కావడంతో కాస్త అసహనంగా ఆయన కనిపించారు. మంగళవారంనాడు మీడియా ముందుకు వచ్చిన ఆయన సినిమా గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఏ సినిమాకూ దీనికి పోలికలేదని తేల్చిచెప్పారు.
 
ఇదిలా వుండగా, ఈ ట్రైలర్ విడుదలకాగానే తమిళ దర్శకుడు శంకర్ తాను అనుకున్నఓ నవలలోని అంశాలను తీయాలని చేసుకున్న ప్రయత్నంలో ఓ సినిమాను కాపీ చేశారని కామెంట్ చేశారు. ఇది దేవర ట్రైలర్ విడుదలయ్యాక శంకర్ పోస్ట్ చేయడంపై మీ రేమంటారు? అని యువజర్నలిస్టు అడగడంతో  ఆయన దానికీ దీనికి సంబంధంలేనది చెప్పే లోపల దేవర పబ్లిసిటీ వ్యవహారాలు చూసే వ్యక్తి కలగజేసుకుని ఫైర్ అయ్యాడు. ఓన్లీ సినిమా గురించే అడగండి, లేదంటే వెళ్ళిపోండి .. అని కటువుగా అనడంతో ఆ యువ జర్నలిస్టు అవాక్కయ్యాడు. ఆ వెంటనే దర్శకుడు ఇంటర్వూ ముగించాడు. 
 
ప్రస్తుతం దేశమంతా ప్రచారంలో పాల్గొన్న దేవర టీమ్ రేపు అమెరికాలో ఫంక్షన్ చేయనుంది. ఇప్పటికే అక్కడ అభిమానులు, ఔత్సాహికులు అందుకు టిక్కెట్లను కొనుగోలు చేసేశారు. అక్కడ దేవరకు అనూహ్యమైన స్పందన వస్తోంది. మరి ఈనెల 27న విడుదలకాబోతున్న దేవర మొదటి పార్ట్ మాత్రమే విడుదలకాబోతుంది. రెండో పార్ట్ ఇంకా షూట్ చేయలేదని దర్శకుడు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప సెట్‌లో జానీ కొట్టాడు.. పవన్ అందుకే కామ్‌గా వున్నాడు.. మాధవీలత