Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అజ్ఞాతంలోకి రేష్మ.. షకీలా ఏం చెప్పిందంటే..

Advertiesment
Mysterious Missing of Porn actress Reshma
, శనివారం, 26 జనవరి 2019 (10:32 IST)
మలయాళ శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన రేష్మ 12 ఏళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె 12 ఏళ్ల పాటు కనిపించకపోవడంతో  ఆమె మరణించివుంటుందని పుకార్లు వస్తున్నాయి. కానీ ఆమె మరణించివుంటుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. 
 
షకీలాతో ఈడుగా మలయాళ సినీ పరిశ్రమను ఏలిన రేష్మ పుష్కరకాలంగా కనిపించకుండా పోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. షకీలా క్రేజ్‌తో రేష్మ వెనుకబడింది. 
 
శృంగార చిత్రాల్లో నటించేందుకు ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన నటి అకస్మాత్తుగా అదృశ్యం కావడంపై మాలీవుడ్‌లో చర్చకు కారణమైంది. ఇంకా 2007లో ఓ సెక్స్ రాకెట్లో చిక్కుకుని  బెయిలుపై విడుదలైన రేష్మ ఆ తర్వాతి నుంచి కనిపించడం లేదు. ప్రస్తుతం రేష్మ ఎక్కడుందోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
మిస్టరీగా మారిన ఆమె అదృశ్యంపై తాజాగా సహనటి షకీలా స్పందించింది. రేష్మ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందని, మైసూరులో స్థిరపడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది. గత చేదు జ్ఞాపకాలను మరిచిపోయేందుకు రేష్మ ప్రయత్నిస్తోందని షకీలా వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌వితేజ సరసన ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్