సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ తెలుగుతో పాటు ఆరు భారతీయ భాషల్లో డిజిటల్ లిటరసీ లైబ్రరీని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ వెల్లడించింది. 200 మిలియన్ల యువత ఫేస్‌బుక్‌ను కలిగివుండగా.. విద్యావేత్తల కోసం డిజిటల్ లిటరసీ లైబ్రరీలను ఏర్పాటు చేసే దిశగా ఫేస్‌బుక్ రంగం సిద్ధం చేసినట్లు తెలిపింది.
డిజిటల్ లిటరసీని భారత్‌లోకి 2018 చివరికల్లా తెచ్చేందుకు దాదాపు 3 లక్షల మంది ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఇప్పటికే రెండు లక్షల మంది తర్ఫీదు పొందారని పేర్కొంది.
ఈ ట్రైనర్లకు భారతీయ ఖాతాదారుల్లో భద్రత, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, ఫేక్ ప్రొఫైల్స్ గుర్తింపు వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డిజిటల్ లిటరసీ లైబ్రరీని ప్రారంభించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది.