Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా ఫేవరెట్‌ ఆలీగారు పెద్ద సక్సెస్‌ కొడతారుః సమంత అక్కినేని

Advertiesment
Ali
, శుక్రవారం, 23 జులై 2021 (16:27 IST)
Ali-Samantha
ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆలీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి మోహన్‌ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఎ.ఆర్‌.రహమాన్‌ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్‌ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా మారారు. 
 
ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు మార్కెట్‌లోకి విడుదలై చక్కని విజయం దక్కించుకున్నాయి. మొదటి పాటను ప్రభాస్‌ విడుదల చేసి సినిమా పబ్లిసిటీని ప్రారంభిస్తే రెండో పాటను సోనూసూద్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలోని పతాక సన్నివేశంలో వచ్చే మూడో పాటను గ్లామరస్‌ క్వీస్‌ సమంతా అక్కినేని విడుదల చేసి ఆలీకి సినిమా టీమ్‌కి తన అభినందనలు తెలియచేశారు. 
 
సమంతా మాట్లాడుతూ, మూడో పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా ఫేవరేట్‌ ఆలీగారు ప్రొడక్షన్‌ చేస్తున్న మొదటి చిత్రమిది. నాకు ఇలాంటి రియల్‌ లైప్‌ స్టోరీలంటే చాలా ఇష్టం. ఇలాంటి సోల్‌ ఉన్న కథలను నేను చూస్తుంటాను. ఇట్స్‌ ఏ స్లైన్‌ ఆఫ్‌ లైఫ్, ఎందుకంటే రియలిస్టిక్, అండ్‌ రిలేటబుల్‌ స్టోరీ. అందుకే ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఆలీగారి మీద నమ్మకం ఉంది’’ అన్నారు. 
 
ఆలీ మాట్లాడుతూ, సమంత గారు నేను అడగ్గానే నా సినిమాలోని మూడో పాటను విడుదల చేసినందుకు హ్యాపీగా ఉంది. అలాగే తను చేస్తున్న ‘శాకుంతలం’ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. సమంతా గారు మాట్లాడుతూ మీ బ్యానర్‌ పేరు ఏంటి అని అడిగితే, ఆ వుడ్, ఈ వుడ్‌ ఎందుకు అని ఆలీవుడ్‌ అని బ్యానర్‌ పేరు పెట్టాను అని నవ్వుతూ’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాశ వీధుల్లో ట్రైలర్ లోనే ద‌ర్శ‌కుడి ఉద్దేశం కనిపించింది:గోపీచంద్ మలినేని