Murali Mohan, Sriraj Balla, Madhavi Balla
చంద్రముఖి తో పాటు పలు సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించిన నటుడు అభిదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రేమలో... పాపలు బాబులు అనేది ట్యాగ్ లైన్. శ్రీరాజ్ బల్లా తెరకెక్కిస్తున్నారు. విజయ మాధవి బల్లా నిర్మాత. సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది.. ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నిర్మాత లయన్ సాయి వెంకట్,నటుడు సమీర్, నిర్మాత విజయ మాధవి, డైరెక్టర్ శ్రీరాజ్ బల్లా, హీరో అభిదేవ్, సినిమాటోగ్రాఫర్ వంశీ, ఎస్.జి..ఆర్, మ్యూజిక్ డైరెక్టర్స్ రవి బల్లా, ఫ్రాంక్లింగ్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్యానర్ లోగోను తుమ్మల పల్లి రామసత్యనారాయణ రిలీజ్ చేశారు.
ఈ సందర్బంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. విజయ మాధవి బ్యానర్ అనే పేరు అద్భుతంగా ఉంది. మా శ్రీ రాజ్ మంచి దర్శక నిర్మాతగా నిలబడతారు. కష్టపడి, ఇష్టపడి చేస్తే ఫలితం కచ్చితంగా వస్తుంది. ప్రేమలో పాపలు,బాబులు అనే టైటిల్ కొత్తగా ఉంది. కాన్సెప్ట్ కూడా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మా శ్రీరాజ్ సీరియల్స్ చేస్తూనే.. సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
శ్రీరాజ్ మాట్లాడుతూ.. నా గురువు రామసత్యనారాయణ. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు ఎలా తీయాలో నాకు నేర్పించారు. సమీర్ గారు నాకు ఆప్తుడు. నా టీంకు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టాలి. ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదించాలని కోరారు.
రామసత్య నారాయణ మాట్లాడుతూ.. శ్రీ రాజ్ ఎంతో కష్టపడి సినిమాలు చేస్తుంటాడు. ఈ ఐదో సినిమాతో తన భార్యను నిర్మాతగా తెరపైకి తీసుకొస్తున్నాడు. ఈ సినిమాకు పని చేసిన వారంతా కూడా నా మనుషులే. ఈ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్ అని అన్నారు.
హీరో అభిదేవ్ మాట్లాడుతూ.. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నన్ను నేను నిరూపించుకుంటాను. సినిమాను చూసి ఆడియెన్స్ నన్ను సపోర్ట్ చేయండి అని అన్నారు.
నిర్మాత విజయ మాధవి బల్లా మాట్లాడుతూ.. ఇప్పటికి మా ఆయన నాలుగు సినిమాలు చేశారు. ఓ పెద్ద హిట్ కొట్టాలని అనుకుంటూ ఉంటారు. ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. గత 22 ఏళ్లుగా సినిమా గురించే ఆలోచిస్తుంటారు. అందుకే నేను నిర్మాతగా మారాను. మా ఆయన కోసమే నేను నిర్మాతగా మారాను. ప్రేక్షకుల ఆశీర్వాదంతో మున్ముందు మరెన్నో మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను.
సమీర్ మాట్లాడుతూ.. మురళీ మోహన్ గారు ఇలా ఇక్కడక రావడమే ఈ సినిమా మొదటి సక్సెస్. ఆయనది లక్కీ హ్యాండ్. రామసత్య నారాయణ గారు చిన్న సినిమాలను ప్రోత్సహిస్తుంటారు. నా మిత్రుడు శ్రీరాజ్ తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి అని అన్నారు.