Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండస్ట్రీలో ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు: మోహన్ బాబు

Advertiesment
mohan babu
, ఆదివారం, 17 అక్టోబరు 2021 (18:42 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కాస్త మంచు, మెగా ఫ్యామిలీ మధ్య యుద్దంలా మారింది. తాజాగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్సం చేసిన తరువాత మోహన్ బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి.
 
అంత మంది ఉన్నాం.. ఇంత మంది ఉన్నాం.. మా సినిమాలే ఆడతాయి.. అని ఎంతో మంది బెదిరించారు.. కానీ మా సభ్యులు మాత్రం ఎక్కడా భయపడలేదు. వారు మంచు విష్ణును గెలిపించుకున్నారు. అలాంటి వారికి ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలను అని మోహన్ బాబు అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే మోహన్ బాబు మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది.
 
మరో సందర్భంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. చిరంజీవి పెళ్లి సందడి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఇంత చిన్న పదవి, రెండేళ్లు, మూడేళ్లు ఉండే పదవి కోసం ఇలా రోడ్డు మీదకు రావాలా? మనంలో మనం ఇన్ని మాటలు అనుకోవాలా? అంటూ చిరంజీవి మా ఎన్నికలను ఉద్దేశించి ప్రసగించాడు.
 
అయితే తాజాగా మోహన్ బాబు వాటికి కౌంటర్లు వేశాడు. ఇది చిన్న ఉద్యోగమని అన్నారు.. ఏ మీకు తెలియదా? ఇది ఎంత పెద్ద బాధ్యత అని అంటూ మోహన్ బాబు చురకలు అంటించాడు.
 
ఇండస్ట్రీలో ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని, ప్రతిభ, క్రమశిక్షణ ఉంటే అవకాశాలు వస్తాయని మోహన్ బాబు అన్నాడు. మంచు విష్ణు ప్యానెల్ మెంబర్లు, వారికి సపోర్ట్ చేసిన వారికి మెగా హీరోల సినిమాల్లో అవకాశాలు ఇవ్వబోరంటూ వస్తోన్న రూమర్లపై మోహన్ బాబు అలా పరోక్షంగా స్పందించినట్టు కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"పెళ్లి సందD" హీరోయిన్ శ్రీలీల ఆయన కుమార్తె కాదా?