Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిష్ణోయ్‌తో తెగదెంపులు... నిశ్చితార్థం రద్దు చేసుకున్న మెహరీన్

Advertiesment
Mehreen Pirzada
, ఆదివారం, 4 జులై 2021 (10:39 IST)
టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర సీమల్లో నటిస్తూ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మెహరీన్‌.. ఇటీవల పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు, ఆ తర్వాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌కి మనవడైన భవ్య బిష్ణోయ్‌తో అంగరంగ వైభవంగా ఆమె నిశ్చితార్థం కూడా జరుపుకుంది. 
 
అయితే మెహరీన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. భవ్య బిష్ణోయ్‌తో తను పెళ్లిపీటలు ఎక్కడం లేదని, నిశ్చితార్థంకు బ్రేకాఫ్ చెప్పినట్లుగా మెహరీన్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. 'నేను మరియు భవ్య బిష్ణోయ్ కలిసి.. మా నిశ్చితార్థాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము. మా బంధం పెళ్లి వరకు వెళ్లడం లేదు. ఇది మేమిద్దరం స్నేహపూర్వకంగా ఇష్టంతో తీసుకున్న నిర్ణయమే. 
 
ఇకనుంచి భవ్య బిష్ణోయ్‌తోగానీ, అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోగానీ నాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను. ఈ విషయంపై ఇక నేను ఎటువంటి ప్రకటన చేయదలుచుకోలేదు. దయచేసి ఇది నా పర్సనల్ విషయంగా భావించి, అందరూ గౌరవిస్తారని భావిస్తున్నాను. ఇకపై నటిగా కొనసాగాలని భావిస్తూ.. నా తదుపరి ప్రాజెక్ట్‌లు అలాగే నటిగా మెప్పించేందుకు ఎదురుచూస్తున్నాను' అని మెహరీన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రిన్స్ రేటును పెంచాడు? ఎంతో తెలిస్తే షాకే...