Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జన్మజన్మలకూ నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం... చిరంజీవి

Advertiesment
chiru family
, ఆదివారం, 29 జనవరి 2023 (17:22 IST)
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంట్లో ఆమె ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఒక్కచోట కలిశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగేంద్రబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో పాటు ఇద్దరు అక్కలు కూడా అక్కడకు చేరారు. ఈ సందర్భంగా తమ సోదరీమణులతో మెగా బ్రదర్స్ ఉన్న ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన తల్లి పుట్టిన రోజును పురస్కరించుకుని చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. 
 
"ఈ రోజు మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాను అమ్మా.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో తన తల్లికి కుడిఎడమలుగా చిరంజీవి, నాగబాబు నిలబడగా మధ్యలో పవన్ కళ్యాణ్ తన ఇద్దరు అక్కల భుజాలపై చేయి వేసుకుని నిలబడివున్నారు. ఈ ఫోటో ఎంతో చూడముచ్చటగా ఉండటంతో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళ్యాణ్ రామ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది : కర్నాటక మంత్రి సుధాకర్