హీరో సాయి దుర్గ తేజ్ స్ట్రాంగ్ కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. 'విరూపాక్ష', 'బ్రో' బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, రోహిత్ కెపి దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత, నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
SDT18 టీం ప్రముఖ ఫైట్ మాస్టర్స్ కొరియోగ్రాఫ్ చేసిన 15 రోజుల యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి చేసింది. మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ లలో సాయి దుర్గా తేజ్ పవర్ ఫుల్ మాస్ అవతార్‌లో కనిపిస్తారు, హై-ఆక్టేన్ స్టంట్స్, డైనమిక్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయి.
హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాని తెరకెక్కుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో మ్యాసీవ్ సెట్ సిద్ధమవుతోంది. హై స్కేల్, ఇంటెన్సిటీతో SDT18 గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.
ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.