Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

మను చరిత్ర ట్రైలర్‌ చాలా ఇంటెన్స్ గా వుంది : హీరో విశ్వక్ సేన్

Advertiesment
Vishwak Sen, Shiva Kandukuri, Bharat Pedagani, Megha Akash
, మంగళవారం, 13 జూన్ 2023 (16:03 IST)
Vishwak Sen, Shiva Kandukuri, Bharat Pedagani, Megha Akash
శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను చరిత్ర ‘విడుదలకు సిద్ధమవుతోంది.ప్రొద్దుటూర్ టాకీస్ బ్యానర్ లో ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు.
 
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశారు. ట్రైలర్‌ ని బట్టి చూస్తే.. మను చరిత్ర ఒక ఇంటెన్స్  ప్రేమకథ. శివ ఒక ఇంటెన్సివ్ పాత్రను పోషిస్తాడు. అతనికి వివిధ వయసులలో విభిన్న ప్రేమ కథలు ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల అమ్మాయిలందరితో విడిపోతాడు. తనను అంతమొందించాలని అవకాశం కోసం చూస్తున్న కొంతమందితో అతనికి శత్రుత్వం ఉంది.
 
శివ కందుకూరి తన పాత్రలో అద్భుతంగా నటించాడు. చాలా  వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ప్రతి ప్రేమ కథలోనూ మ్యాజిక్ వుంది.  ట్రైలర్ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ ఉంటుందని సూచిస్తోంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
 
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రాజ్ కందుకూరి గారికి శివ ఎంతనో నేనూ అంతే. నా మొదటి సినిమా విడుదల కాకముందు నుంచే నన్ను ప్రోత్సహిస్తున్నారు. నన్ను బలంగా నమ్మారు. శివ సినిమా హిట్ ఐతే నా సినిమా హిట్ అయినంత ఆనందపడతాను. ట్రైలర్ చాలా   ఇంటెన్స్ గా,  ప్రామిసింగ్ గా వుంది. లవ్ యాక్షన్ నా ఫేవరేట్ జోనర్.  చాలా మంచి నటీనటులు, టెక్నికల్ టీం కలిసి చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా సినిమా మంచి అనుభూతిని ఇచ్చి పెద్ద విజయం సాధిస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. జూన్ 23న అందరూ థియేటర్ లో చూడాలి’’ అని కోరారు
 
శివ కందుకూరి మాట్లాడుతూ..  ప్రతి నటుడికి ఒక బకెట్ లిస్టు వుంటుంది. రా సెట్టింగ్  ఫైట్ చేయాలి, డ్యాన్స్ చేయాలి, మాస్ పాట ఉండాలి.. ఇవన్నీ నాకు ‘మను చరిత్ర’ కంప్లీట్ చేసింది. విశ్వక్ ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. టీం అంతా చాలా కష్టపడ్డాం. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. 16న ప్రభాస్ అన్న ఆదిపురుష్ కోసం థియేటర్ కి వెళ్తాం. జూన్ 23న మా సినిమా వస్తుంది. అదే ఊపులో మా సినిమాని కూడా చూసి ఆదరించాలి. ఖచ్చితంగా మంచి సినిమా ఇస్తున్నాం. ఎవరినీ నిరాశ పరచదు. దర్శకుడు భరత్ కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. చాలా కష్టపడ్డాడు. మను లాంటి మంచి పాత్రని ఇచ్చిన భరత్ కి థాంక్స్. మేఘ చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ తెలిపారు.
 
మేఘా ఆకాష్ మాట్లాడుతూ..  చాలా కష్టపడి ఇష్టంతో చేసిన చిత్రమిది. పాటలు, టీజర్ , ట్రైలర్ మీకు నచ్చడం ఆనందంగా వుంది. మీ అందరి ప్రేమ కావాలి. మీ అందరూ ‘మను చరిత్ర’ థియేటర్ లో చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి’’ అని కోరారు.  
 
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. శివ ఎంతో విశ్వక్ అంతే. విశ్వక్ అప్పటికి ఇప్పటికి ఒకేలా వున్నాడు. తన నుంచి చాలా నేర్చుకోవాలి. తను ఈ వేడుకకి రావడం ఆనందంగా వుంది.  జూన్ 23న సినిమా వస్తోంది. టీం అంతా సినిమా కోసం హార్డ్ వర్క్ చేసింది.  మీ అందరికీ సినిమా నచ్చుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదిపురుష్ ఓ సంచలనం, త్వరలో హాలీవుడ్ సినిమాల నిర్మాణం: నిర్మాత టి.జి. విశ్వప్రసాద్