Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తన తండ్రిని స్పర్శించక ముందే ఒక బిడ్డకు కన్న తండ్రిని లేకుండా చేశాడు... హీరో మనోజ్ లేఖ

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించాడు. తన కుమార్తె తమ కంటే తక్కువ కులం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో కుమార్తె భర్తను తండ్రి కిరాయి మనుషులతో హత్య చేయించిన

Advertiesment
Manoj Kumar Manchu
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (15:04 IST)
మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించాడు. తన కుమార్తె తమ కంటే తక్కువ కులం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో కుమార్తె భర్తను తండ్రి కిరాయి మనుషులతో హత్య చేయించిన విషయం తెల్సిందే. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈనేపథ్యంలో మంచు మనోజ్ భావోద్వేగంతో ట్విట్టర్ ద్వారా ఓ లేఖను రాశాడు. 'మానవత్వం కంటే కులం, మతమే ఎక్కువని భావించే వారి'కే ఈ లేఖ అంటూ ప్రారంభించాడు.
 
సినీ పరిశ్రమ కానీ, రాజకీయ పార్టీలు కానీ, కాలేజ్ యూనియన్లు కానీ, కుల లేదా మత సంఘాలు కానీ, మరే రంగమైనా కానీ... క్యాస్ట్ ఫీలింగ్స్ చాలా దారుణం. ప్రణయ్‌తో పాటు మరెందరినో బలిగొన్న ఈ దారుణాలకు కులాలను, మతాలను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వారే కారణం. మనిషి జీవితం కంటే మరేదీ ఎక్కువ కాదనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. తన తండ్రిని స్పర్శించక ముందే ఒక బిడ్డ కన్న తండ్రిని కోల్పోవడం మనస్సును కలచి వేసే అంశం. కేవలం కులం కోసం వాళ్ల జీవితాలను ఛిన్నాభిన్నం చేశారు. వారి జీవితాల కంటే మీకు కులమే ఎక్కువా?
 
మన అందరికీ ఒకేలాంటి గుండె, శరీరం ఉన్నాయి. మనం పీల్చేగాలి కూడా ఒక్కటే. కానీ, కులం, మతం పేరుతో మరొకరి పట్ల అమానుషంగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు? మనుషులంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది? కుల ప్రేమికులను, మద్దతుదారులను చూసి సిగ్గుపడుతున్నా. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తేకాకుండా... కులాలను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనకు బాధ్యులే. కుల వివక్ష నశించాలి. 
 
ఈ మహమ్మారిని వెంటనే అంతం చేయాలి. మనుషుల్లా ప్రవర్తించండి. మీ అందరికీ ఇదే నా హృదయపూర్వక విన్నపం. మన చిన్నారులకు మంచి భవిష్యత్తును అందిద్దాం. అమృత పరిస్థితి నన్ను ఎంతగానో కలచి వేసింది. ప్రణయ్ ఆత్మకుశాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని మంచు మనోజ్ తన భావోద్వేగాన్ని ఓ లేఖ ద్వారా వ్యక్తంచేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''రంగస్థలం'' కొత్త రికార్డు.. రంగమ్మా.. మంగమ్మా.. పాటకు 10 కోట్ల వ్యూస్