ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణిక రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కంగనా ఓ దశలో దర్శకత్వ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.
కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం నచ్చక సోనూసూద్ లాంటి నటుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. క్రిష్ దర్శకుడిగా చాలామటుకు తెరకెక్కినా.. చివరకు కంగనా ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.
హిందీ భాషలో విడుదలైన మణికర్ణిక ట్రైలర్ అదిరిపోయింది. ఈ ట్రైలర్లో కంగనా రనౌత్ లుక్ అదిరిపోయింది. యుద్ధ విన్యాసాలు అదరగొట్టింది. అన్నీ షేడ్స్‌లో తన నటనను కనబరిచింది. కంగనా మణికర్ణిక పాత్రలో ఒదిగిపోయింది. విడుదలైన గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక మణికర్ణక ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.