ఇంట్రస్టింగ్ క్యారెక్టరైజేషన్ తో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ సెట్ అవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
డా. మంచు మోహన్ బాబు గారి ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి స్ర్కిఫ్ట్ అందించారు.
కాగా ఈ సినిమాలో తన చేస్తున్న 'గాలి నాగేశ్వరరావు' క్యారెక్టర్ గెటప్ ని తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు మంచు విష్ణు. ఇప్పటివరకూ చేయని పాత్రలో ఈ సినిమాలో కనువిందు చేయబోతున్నారు విష్ణు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను యూనిక్యూ ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా వెల్లడించడానికి ప్లాన్ చేస్తోంది చిత్రం యూనిట్. ముగించారు.