Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్థరాత్రి 3 గంటలకు ఫోన్ చేసి రమ్మంటారు.. ముద్దు సీన్స్, పొట్టిదుస్తులు?: మల్లికా షెరావత్

హాలీవుడ్‌లో మీ టూ, బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది, ఉత్తరాది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్‌పై తమకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా ఐటమ్ గార్ల్‌గ

Advertiesment
అర్థరాత్రి 3 గంటలకు ఫోన్ చేసి రమ్మంటారు.. ముద్దు సీన్స్, పొట్టిదుస్తులు?: మల్లికా షెరావత్
, గురువారం, 5 జులై 2018 (13:28 IST)
హాలీవుడ్‌లో మీ టూ, బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది, ఉత్తరాది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్‌పై తమకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా ఐటమ్ గార్ల్‌గా, బోల్డ్ నటిగా ముద్రపడ్డ మల్లికాషెరావత్ కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 
ఓ ఇంటర్వ్యూలో మల్లికా షెరవాత్ మాట్లాడుతూ.. అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఫోన్ చేసి.. తనను గదికి రమ్మని పిలిచేవారని ఆవేదన వ్యక్తం చేసింది. హీరోలతో తాను చనువుగా లేనందుకే కొన్ని సినిమాల నుంచి తనను తప్పించారని మల్లిక చెప్పుకొచ్చింది. హీరోలతో చనువుగా.. దగ్గరగా వుండేందుకు ఇబ్బంది ఏమిటని చాలామంది తనను ప్రశ్నించారని చెప్పింది. 
 
మర్డర్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన తనకు అలాంటి పాత్రలే వచ్చాయని.. హీరోలు, దర్శకుల కారణంగానే తనలోని నటి దూరమైందని, హాట్ గార్ల్‌గా మిగిలిపోయానని మల్లికా షెరావత్ వెల్లడించింది. తెరపై పొట్టి దుస్తులు వేసుకుని, ముద్దు సన్నివేశాల్లో నటించిన తనను సిగ్గు వదిలేసిన మహిళంటూ నిందలు వేశారన్నారు. తొలినాళ్లలో ఎలాంటి పాత్రల్లోనైనా నటించడమే తాను చేసిన పెద్ద తప్పని తెలిపింది. 
 
హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు తనతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవారు. తాను చేసే రోల్స్‌ను బట్టి తన క్యారెక్టర్‌ను అంచనా వేసేవారు. దాంతో తాను అభద్రతాభావానికి గురయ్యేదానిని. అలాంటి సమయాల్లో తాను చేసేది సరైందా కాదా తనకు తానుగా ప్రశ్నించుకునే దాన్ని. మీడియా కూడా తనకు వ్యతిరేకంగా, ప్రతికూలంగా వ్యవహరించేదని మల్లికా షెరవాత్ ఆవేదన వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 9న ముఖ్యమంత్రిగా బాలయ్య ప్రమాణ స్వీకారం...