Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Advertiesment
Maheshbabu

సెల్వి

, గురువారం, 3 జులై 2025 (14:03 IST)
దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ 2010లో నిర్మించిన తెలుగు రొమాంటిక్ డ్రామా 'ఏ మాయ చేసావే' టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాశారనే ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఏ మాయ చేసావే సినిమా.. నాగ చైతన్య కోసం కాదు. ఈ సినిమాను మహేష్ కోసం రాశానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ వెల్లడించారు. 
 
ఇక ఈ చిత్రాన్ని నిర్మించింది మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని. ఇటీవలి పాడ్‌కాస్ట్‌లో గౌతమ్ మాట్లాడుతూ.. ఏ మాయ చేసావే ఫుల్ లవ్ సబ్జెక్ట్ అని.. ప్రేక్షకులు తన నుండి యాక్షన్‌ను ఆశిస్తున్నారని భావించిన మహేష్ బాబు ఈ సినిమా వద్దన్నారని చెప్పారు. 
 
ప్రేమ కథల కంటే యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ పాత్రను తిరస్కరించారు. అప్పటికి, పోకిరి, అతడు, ఒక్కడు వంటి పెద్ద ఎత్తున సినిమాల్లో నటించారు. ఇంకా ఏ మాయ చేసావే సినిమా గురించి గౌతమ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో చిరంజీవి గెస్ట్ రోల్‌గా పెట్టాలని అనుకున్నానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్