Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్మిక ఎంతో స్వీట్‌గా ఉంటుంది... మహేశ్ బాబు

Advertiesment
Mahesh Babu
, సోమవారం, 6 జనవరి 2020 (11:23 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. 
 
ఇందులో మహేశ్ బాబు మాట్లాడుతూ, ఇదొక అద్భుతమైన రోజని, తమ దర్శకుడు అనిల్ రావిపూడికి ఇవాళ అబ్బాయి పుట్టాడని, నిర్మాత దిల్ రాజు రెండోసారి తాత అయ్యాడని తెలిపాడు. తమ ఈవెంట్ రోజు ఇన్ని మంచి ఘటనలు జరగడం నిజంగా మిరాకిల్ అనిపిస్తోందని తెలిపారు. 
 
ఇకపోతే, లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో కలిసి మరోసారి నటించడం నిజంగా చాలా ఆనందంగా ఉందన్నారు. ఆమెతో కలిసి షూటింగ్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
 
'కొడుకుదిద్దిన కాపురం' చిత్రంలో విజయశాంతితో నటించానని, మళ్లీ ఇన్నాళ్లకు ఆమెతో నటించానని తెలిపారు. ఇప్పటికీ ఆమె క్రమశిక్షణలో ఏమాత్రం తేడాలేదని అన్నారు. పైగా, ఈ చిత్రంలోని పాత్ర ఆమెతో చేయించడానికి దర్శకుడు అనిల్ చాలా శ్రమించారనీ, చివరకు ఆమె సమ్మతించడం ఆనందంగా ఉందన్నారు. 
 
అలాగే, మెగాస్టార్ చిరంజీవి గారిలో కూడా తాను అదే అంకితభావం చూశానని తెలిపారు. అడిగిన వెంటనే ఆయన ఈ కార్యక్రమానికి వచ్చేందుకు  సమ్మతించారని, ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. 
 
ఇకపోతే, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి గురించి చెబుతూ, అంత ఎనర్జీ ఉన్న దర్శకుడ్ని మరెవ్వర్నీ చూడలేదని వెల్లడించారు. రష్మిక గురించి మాట్లాడుతూ, ఎంతో స్వీట్ అంటూ పొగిడారు. అభిమానుల గురించి చెబుతూ, ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇలాంటి అభిమానులు దక్కారని ఆనందం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైండ్ బ్లోయింగ్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్‌తో అదరగొట్టిన ‘సరిలేరు నీకెవ్వరు’ థియేట్రికల్ ట్రైలర్