Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మౌంటెన్‌ డ్యూ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మహేష్‌బాబు

Advertiesment
Mountain Dew Brand Ambassador
, శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (17:57 IST)
Mountain Dew Brand Ambassador
మహేష్‌బాబు మౌంటెన్‌ డ్యూ 'వేసవి డ్రింక్ కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్నారు. దీని కోసం యాక్షన్ ఎపిసోడ్ చేసాడు.  బ్రాండ్‌ అంబాసిడర్‌ మహేష్‌బాబు మాట్లాడుతూ ‘‘భయాన్ని అధిగమించే ధైర్యం, తెలియని ఉద్వేగం– మౌంటెన్‌ డ్యూ యొక్క  వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా నాతో ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ చిత్రం కోసం ఈ టీమ్‌తో మరలా కలవడం చాలా ఆనందంగా ఉంది. దీనిలో యాక్షన్‌ మాత్రమే కాదు ఎడ్వెంచర్‌ కూడా ఉంది’’ అని అన్నారు.
 
ఈ ప్రచారం గురించి పెప్సీ కో ఇండియా, మౌంటెన్‌ డ్యూ , కేటగిరి డైరెక్టర్‌ వినీత్‌ శర్మ మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబుతో మా అనుబంధం కొనసాగిస్తుండటం పట్ల చాలా ఆనందంగా ఉన్నాము. ఈ వేసవి సీజన్‌ కోసం మా నూతన ప్రచారాన్ని మౌంటెన్‌ డ్యూ కోసం విడుదల చేశాము. ఇది బ్రాండ్‌ యొక్క ‘డర్‌ కే ఆగే జీత్‌ హై’ సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తుంది. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ భయాలు అధిగమించండి, విజేతలుగా నిలవండి అని ప్రోత్సహిస్తారు. ఈ ప్రచారాన్ని వినియోగదారులతో పాటుగా విభిన్నమైన అభిరుచులు కలిగిన మహేష్‌బాబు అభిమానులను సైతం ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము. అంతేకాదు, ఇది వారికి ఆత్మవిశ్వాసం కలిగించడంతో పాటుగా మౌంటెన్‌ డ్యూ రుచిని సైతం కోరుకునేలా చేస్తుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
ఈ చిత్రంలో, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఓ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధపడతాడు. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఓ కార్గో విమానం నుంచి ఫ్రీఫాల్‌ స్టంట్‌ చేస్తాడు. అత్యంత ఎత్తులో ఉండటం వల్ల సిబ్బంది అంతా అతను సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేస్తాడా లేదా అన్న ఆందోళనలో ఉంటారు. ఈ చిత్రంలో , ప్రతి ఒక్కరికీ తమ సొంత భయాలు ఎలా ఉంటాయో చూపుతారు. అయితే ఆ భయాలను అధిగమించడానికి వారు ఎలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా మిగిలిన వారికి భిన్నంగా ఉంటారనేది తెలుపుతుంది. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా, ఈ స్టంట్‌ను ముగించాలనే సంకల్పంతో , మహేష్‌ బాబు మౌంటెన్‌ డ్యూ ఓ గుటక వేయడంతో పాటుగా సాహసానికి సిద్ధమవుతాడు. ఈ చిత్రం ఓ ప్రోత్సాహపూరిత సందేశంతో ముగుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెస్ట్ యాక్టర్ గా రామ్ చరణ్ కు క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డు