'సర్కారు వారి పాట'.. రిలీజ్ అయ్యాక తన భార్య, పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ అక్కడ బాగా ఎంజాయ్ చేసి ఈ మధ్యనే ఇండియాకి తిరిగి వచ్చాడు.
ఇక తాజాగా ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట కలిసినట్టు ఉన్నారు. దీంతో ఫ్యామిలీ మొత్తం తో కలిసి ఓ సెల్ఫీ దిగాడు మహేష్. ఈ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'వన్ విత్ ఫామ్' అంటూ కామెంట్ పెట్టాడు.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ ఫ్యామిలీతో పాటు మంజుల ఘట్టమనేని ఫ్యామిలీ, హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ, పొలిటిషన్ గల్లా జయదేవ్ ఫ్యామిలీ కూడా ఉంది.
నిజానికి వీళ్లంతా కృష్ణ గారి పుట్టినరోజు నాడు కలుస్తూ ఉంటారు. కానీ కృష్ణ గారి పుట్టినరోజు నాడు మహేష్ విదేశాల్లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు అంతా ఒక చోట కలిసినట్టు తెలుస్తుంది.