Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''మా'' కౌంటింగ్ ప్రారంభం... మంచు విష్ణు ప్యానలే గెలుస్తుంది.. ఎవరు?

Advertiesment
MAA Elections Counting 2021 LIVE
, ఆదివారం, 10 అక్టోబరు 2021 (17:25 IST)
అనుకున్నదానికంటే ముందే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 4గంటలకు కౌంటింగ్‌ ప్రారం‍భించాలనుకున్నా.. మధ్యాహ్నం 3.30గంటలకే కౌంటింగ్‌ను ప్రారంభించారు. ఓట్లు అధికంగా రావడంతో లెక్కింపు ప్రక్రియ ముందే ప్రారంభించినట్టు సమాచారం. మోహన్‌ బాబు, మురళీ మోహన్‌ సమక్షంలో కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. 
 
ముందుగా కార్యవర్గ సభ్యులకు పోలైన ఓట్లను సిబ్బంది వేరు చేశారు. ముందు 'మా` ఈసీ సభ్యుల ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత అధ్యక్ష అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 665 ఓట్లు పోలయినట్టు సమాచారం.  
 
తొలిసారి ఇంత భారీ పోలింగ్‌ నమోదవడం మంచి పరిణామమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌ అవుతుందని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు. మంచు విష్ణు ప్యానలే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Samantha ఏంటి మీకు డబ్బు వద్దా అంటూ ఎన్టీఆర్, కావాలి కావాలి అంటున్న సమంత