Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

మిస్టర్ కింగ్ నుండి లిరికల్ వీడియో విడుదల

Advertiesment
Sharan Kumar, Nishkala
, శుక్రవారం, 12 ఆగస్టు 2022 (16:40 IST)
Sharan Kumar, Nishkala
విజ‌య నిర్మల గారి మ‌న‌వుడు శరణ్ కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ ప‌తాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.
 
మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుండి సిన్ని సిన్ని పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వినగానే ఆకట్టుకునే క్యాచి ట్యూన్ తో ఈ పాటని యూత్ ఫుల్ నెంబర్ గా స్వరపరిచారు మణిశర్మ. క్రేజీ సింగర్ రాహుల్ సిప్లిగుంజ్ పాటని ఎనర్జిటిక్ గా పాడారు.
 
♫ మరీ ఇంత అందమేంటి సిన్నీ సిన్నీ
మహాద్భుతం అంటారేయ్ తెలుగులో దీన్ని
ఎలా లెక్కపెట్టగలనీ వన్నెలు ఇన్ని
తెల్లార్లు కూర్చున్నా మిగులును కొన్ని
సిన్ని సూడు సిన్నీ
నాలో సిందులన్నీ  ♫
 
ఈ పాటకు భాస్కరభట్ల అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. యూత్ ఫుల్ నెంబర్ గా ఆకట్టుకున్న ఈ పాట ఇన్స్ టెంట్ హిట్ గా నిలిచింది. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ద‌శ‌లో వుంది.  
 
న‌టీన‌టులు:
శరణ్ కుమార్, నిష్కల, ఊర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్,ఎఎస్ కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు
సాంకేతిక విభాగం:
నిర్మాణం: హన్విక క్రియేషన్స్, ప్రెజెంట్స్: బేబీ హన్విక ప్రెజెంట్స్, నిర్మాత: బి.ఎన్.రావు,  కథ, దర్శకత్వం: శశిధర్ చావలి, సంగీత దర్శకుడు: మణిశర్మ, సినిమాటోగ్రాఫర్: తన్వీర్ అంజుమ్
సహ నిర్మాత: రవికిరణ్ చావలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ కన్నడ గాయకుడు శివమొగ సుబ్బన్న మృతి