Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నైలోని ఎన్టీఆర్ నివాసాన్ని అమ్మేస్తారా? గండిపేట కుటీరంపై లక్ష్మీపార్వతీ ఏమన్నారు?

లెజెండరీ నటుడు, తెలుగు తెరకి స్టార్ స్టేటస్ తెచ్చిన తొలితరం హీరో, అంతకుమించి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ ఇల్లు అమ్మకానికి సిద్ధమైందనే వార్తలు రావడంతో అభిమానులు నిరాశ చెంద

Advertiesment
Laxmi parvathi
, సోమవారం, 6 నవంబరు 2017 (11:43 IST)
లెజెండరీ నటుడు, తెలుగు తెరకి స్టార్ స్టేటస్ తెచ్చిన తొలితరం హీరో, అంతకుమించి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ ఇల్లు అమ్మకానికి సిద్ధమైందనే వార్తలు రావడంతో అభిమానులు నిరాశ చెందారు. చెన్నైలోని టీ నగర్, బజుల్లా రోడ్డులోని హౌస్ నెంబర్ 28 ఎన్నో మధుర జ్ఞాపకాలకు వేదిక.

అప్పటి సినీతారలకు మద్రాసుకు విడదీయరాని అనుబంధం వుంది. అప్పట్లో చెన్నైలో నివాసం ఏర్పరుచుకున్న ఎన్టీఆర్ నివాసం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న ‘ఇల్లు అమ్మబడును' బోర్డును చూసిన ఎన్టీఆర్ అభిమానులు మనస్తాపం చెందుతున్నారు. 
 
ఎన్టీఆర్ సహా కుటుంబ సభ్యులంతా హైదరాబాదుకి వచ్చేయడంతో ప్రస్తుతం బజుల్లా రోడ్డులోని ఆ ఇల్లు ఆలనా పాలనా లేక కళావిహీనంగా మారింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఇంటి బయట ఇప్పుడు వేలాడుతున్న "ఇల్లు అమ్మబడును" అనే బోర్డు వుండటాన్ని చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో గండిపేటలోని ఎన్టీఆర్ కుటీరాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని దాన్ని అమ్మే ప్రసక్తే లేదని.. లీజుకు కూడా ఇవ్వనని ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. తన భర్తకు సంబంధించి తనకు మిగిలిన ఆస్తి గండిపేటలోని కుటీరం మాత్రమేనని అన్నారు. ఆయన గుర్తుగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పారు. ఎవరైనా సరే గండిపేటకు వచ్చి ఎన్టీఆర్ కుటీరాన్ని చూడవచ్చని లక్ష్మీపార్వతి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గరుడవేగ' హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తెపై కేసు