'గరుడవేగ' హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తెపై కేసు
						
		
						
				
'పీఎస్వీ గరుడవేగ' చిత్రం విజయోత్సవంలో మునిగితేలుతున్న హీరో రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులకు ఇది నిజంగానే చేదువార్త. ఈ దంపతుల పెద్ద కుమార్తె శివాని తన వాహనంలో ప్రయాణిస్తూ.. నిలిపి ఉంచిన మరో కారును ఢ
			
		          
	  
	
		
										
								
																	'పీఎస్వీ గరుడవేగ' చిత్రం విజయోత్సవంలో మునిగితేలుతున్న హీరో రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులకు ఇది నిజంగానే చేదువార్త. ఈ దంపతుల పెద్ద కుమార్తె శివాని తన వాహనంలో ప్రయాణిస్తూ.. నిలిపి ఉంచిన మరో కారును ఢీకొట్టిన విషయం తెల్సిందే. ఇది శనివారం జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5లో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	అయితే తన కారు పూర్తిగా డ్యామేజీకావడంతో బాధితుడు తనకు రూ.30 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. శివానీ తల్లి జీవిత వచ్చి బాధితునితో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 
 
									
										
								
																	
	 
	మరోవైపు కారు డ్యామేజ్‌కి సంబంధించి ఎస్‌పీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీనియర్ ఆపరేషనల్ మేనేజర్ అశోక్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివానిపై కేసు నమోదు చేశారు. కాగా, శివానీ వైద్య కోర్సు చదువుతున్న విషయం తెల్సిందే.