Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లగడపాటి విక్రమ్ కు కొత్త‌గా రెక్క‌లొచ్చెనా.

లగడపాటి విక్రమ్ కు కొత్త‌గా రెక్క‌లొచ్చెనా.
, శనివారం, 22 జనవరి 2022 (11:04 IST)
Lagadapati Vikram
ప్ర‌ముఖ నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా `కొత్త‌గా రెక్క‌లొచ్చెనా`అంటూ రాబోతున్నాడు. అస‌లు సినిమా పేరు వర్జిన్ స్టోరి. `కొత్త‌గా రెక్క‌లొచ్చెనా` అనేది కాప్ష‌న్ పెట్టారు. యుక్త‌వ‌య‌స్సులో వున్న యువ‌త‌కు `కొత్త‌గా రెక్క‌లొచ్చాయ్‌.. అన్నంతగా తేలియాడుతుంటారు. ఈ పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది. 
 
ఇంత‌కుముందు లగడపాటి విక్రమ్ `రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. తాజాగా  దిల్ రాజు నిర్మించిన `రౌడీ బాయ్స్` చిత్రంలో కీలక పాత్రలో నటించారు. రౌడీ బౌయ్స్ లో విక్రమ్ చేసిన క్యారెక్టర్ కు అతని
పర్మార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
 
రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి వర్జిన్ స్టోరి చిత్రంతో టాలీవుడ్కు  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 3వ లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు ఫిల్మ్ యూనిట్. సోషల్ మీడియా ద్వారా పాటను
డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
 
సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుంది అనే పాయింట్ తో బిగినింగ్ నుంచి ఎండింగ్ వ‌రకు ఎంజాయ్ చేసేలా వర్జిన్ స్టోరి సినిమా ఉంటుందని నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
విక్రమ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – అచు రాజమణి, సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్, ఎడిటర్ – గ్యారీ, సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్శ్రీ రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాఘవేంద్ర, నిర్మాతలు – లగడపాటి శిరీష్, శ్రీధర్, రచన దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీక్రెట్‌గా తల్లి అయిన ప్రియాంకా చోప్రా: పుట్టింది ఆడ బిడ్డా? లేదా..?