Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్కడ మొత్తం విప్పి చూపినా గుర్తింపు రాలేదు : కైరా దత్

టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉత్తరాది భామలు... వారి అందచందాలే! ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన ఐటెంగర్ల్‌ కైరాదత్‌. 'రేసుగుర్రం'లో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కైరా 'ప

అక్కడ మొత్తం విప్పి చూపినా గుర్తింపు రాలేదు : కైరా దత్
, మంగళవారం, 16 జనవరి 2018 (13:50 IST)
టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉత్తరాది భామలు... వారి అందచందాలే! ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన ఐటెంగర్ల్‌ కైరాదత్‌. 'రేసుగుర్రం'లో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కైరా 'పైసావసూల్‌'లో తన ఆటతో కుర్రకారుతో విజిల్స్‌ వేయించింది. ఈమె తాజాగా తన మనసులోని మాటను వెల్లడిస్తూ,
 
ఉత్తరాదిన బోల్డ్‌ క్యారక్టర్లు చేశాను. కానీ వాటి వల్ల రాని గుర్తింపు ఐటెంసాంగ్స్‌తోనే వచ్చింది. ఐటెంసాంగ్స్‌ చేస్తే వచ్చే కిక్కే వేరు. పాట కోసం వేసే సెట్టింగులు, ఆ మ్యూజిక్‌ వింటూంటేనే చెప్పలేనంత ఉత్సాహం వచ్చేస్తుంది. సినిమాలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌ చేసినా రానంత పేరు ఓ ఐటెంసాంగ్‌తో వస్తుంది. సినిమా ఆడొచ్చు. ఆడకపోవచ్చు. కానీ కొన్ని పాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. 
 
ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిన నాకు మంచి గుర్తింపే వస్తోంది. ఇక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయి. డ్యాన్సులో అల్లు అర్జున్‌తో పోటీ పడటం కష్టమే! తనతో చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీసు చేసేదాన్ని. తెలుగులో చాలా మందితో కలిసి చేయాలని ఉంది. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలు చూస్తున్నాను. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిడిల్ క్లాస్ అమ్మాయిని... లిప్‌లాక్‌కు పారెంట్స్ ఒప్పుకోరు : సాయి పల్లవి