Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని ''కృష్ణార్జున యుద్ధం'': 'దారి చూడు' తొలి సాంగ్ అదిరింది.. (వీడియో)

సంక్రాంతి సందర్భంగా నేచురల్ స్టార్ నాని ''కృష్ణార్జున యుద్ధం'' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్‌ హీరోయిన్లు. భోగి రోజున కృష్ణ,

Advertiesment
నాని ''కృష్ణార్జున యుద్ధం'': 'దారి చూడు' తొలి సాంగ్ అదిరింది.. (వీడియో)
, మంగళవారం, 16 జనవరి 2018 (13:21 IST)
సంక్రాంతి సందర్భంగా నేచురల్ స్టార్ నాని ''కృష్ణార్జున యుద్ధం'' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్‌ హీరోయిన్లు. భోగి రోజున కృష్ణ, సంక్రాంతి రోజున అర్జున్‌ ఫస్ట్‌లుక్‌లను విడుదల చేసిన నాని కనుమ రోజు సినిమాలోని ఫస్ట్‌సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ దినేష్ కుమార్, కెమెరా- కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు: సాహు గరపాటి,  హరీష్ పెడ్డి, సమర్పణ- వెంకట్ బోయనపల్లి, ప్రొడక్షన్ హౌస్ - షైన్ స్క్రీన్స్. 
 
ఇక కృష్ణార్జునయుద్ధంలో డబుల్ రోల్ చేస్తున్న నాని.. కృష్ణ పాత్రలో రఫ్‌ అండ్‌ టఫ్‌గా కన్పిస్తూ… అర్జున్‌ గెటప్‌లో హుషారుగా కన్పించాడు. వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ''దారి చూడు'' అంటూ సాగే పాట విడుదలైంది. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాకు తమిళ యంగ్ దర్శకుడు హిప్ ఆప్ తమిళ సంగీతం సమకూర్చారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాహా.. బొలెరో కార్లను ఎత్తడానికి హైడ్రాలిక్ లిఫ్ట్‌లక్కర్లేదు.. బాలయ్య ఉన్నాడట...