Siddu jonnalagadda, Dallaslo desi dongalu
హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించనున్న లేటెస్ట్ ఫిల్మ్ 'డల్లాస్‌లో దేశి దొంగలు'. క్రైమ్ కామెడీగా రూపొందే ఈ చిత్రానికి సాయికిరణ్ దైద దర్శకుడు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, కళాహి మీడియా బ్యానర్లపై కోన వెంకట్, యశ్వంత్ దగ్గుమాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం సిద్ధు జొన్నలగడ్డ బర్త్‌డే. ఈ సందర్భంగా 'డల్లాస్‌లో దేశి దొంగలు' టైటిల్ మూవీని అనౌన్స్ చేయడంతో పాటు, టైటిల్ లోగో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
వైవిధ్యంగా డిజైన్ చేసిన ఈ టైటిల్ పోస్టర్‌లో అత్యంత ఎత్తయిన ఓ బిల్డింగ్ టెర్రెస్‌పై నిల్చొని ఉన్న సిద్ధు.. చేతిలో గన్, ముఖానికి మాస్క్‌తో కనిపిస్తున్నారు. టైటిల్ డిజైన్‌తోటే సినిమాపై ఆసక్తి రేకెత్తడం అరుదుగా జరుగుతుంటుంది. 'డల్లాస్‌లో దేశి దొంగలు' ఆ ఇంపాక్ట్‌ను కలిగిస్తోంది.
ఈ మూవీని "DDD" అని కూడా పిలుస్తున్నారు. లవ్ స్టోరీ మేళవించిన బ్యాంక్ రాబరీ స్టోరీతో రూపొందే ఈ సినిమా షూటింగ్‌ను మే నెలలో ప్రారంభించనున్నారు. పూర్తిగా అమెరికాలోని డల్లాస్‌లో చిత్రీకరణ జరుపుతారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ గట్టు సినిమాటోగ్రాఫర్. ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తారు.