హీరోయిన్ నయనతార మాజీ ప్రియుడు, తమిళ హీరో శింబు వేదికపై కన్నీరు పెట్టుకున్నారు. కొందరు తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ తీవ్ర భావోద్వేగానికిలోనై కళ్లు చెమర్చారు. ఈ ఘటన గురువారం తాను నటించిన మనాడు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా తమతమ ప్రసంగాలను పూర్తి చేశారు. ఆ తర్వాత చివరంగా హీరో శింబు మాట్లాడారు. ప్రారంభంలో సరదాగానే మాట్లాడిన శింబు తన ప్రసంగం ముగింపు సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
"తనను కొందరు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారనీ, వారి సంగతి నేను చూసుకుంటాను.. నన్ను మాత్రం మీరు (ఫ్యాన్స్) చూసుకోవాలంటూ" ఈ వేడుకకు హాజరైన అభిమానలకు విజ్ఞప్తి చేశారు.
దీంతో అప్పటివరకు ఎంతో సరదాగా సాగిన కార్యక్రమం ఒక్కసారిగా నిశ్శబద్ధంగా ఆవహించింది. ఆ తర్వాత వేదికపై ఉన్న నిర్మాతలు కె.రాజన్, సురేష్ కామాక్షి, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, యువ నటుడు మహత్ రాఘవేంద్ర వంటివారు శింబును ఓదార్చారు.