Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

Advertiesment
King Jackie - Queen team

దేవీ

, బుధవారం, 30 ఏప్రియల్ 2025 (18:35 IST)
King Jackie - Queen team
1990ల నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా ’కింగ్ జాకీ క్వీన్" అనే చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టితో పాటు శశి ఓదెల, యుక్తి తరేజ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కె.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ గ్లింప్స్ తో సంచలనాన్ని సృష్టించింది.
 
ఈరోజు నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన టీజర్.. 'రాజు' పాత్రను పోషించిన దీక్షిత్ శెట్టి చెప్పిన డైలాగ్ తో  ప్రారంభమవుతుంది: "నగరం, తుపాకీ రెండూ ఒకటే - అవి వాటిని పట్టుకున్న వ్యక్తి మాట వింటాయి." శశి ఓదెల 'జాకీ' పాత్రలో పరిచయం కాగా తనది గొప్పతనాన్ని సాధించడానికి పెద్ద రిస్క్‌లు తీసుకోవడంలో నమ్మకం ఉన్న పాత్ర. యుక్తి తరేజా 'రాణి'పాత్రలో కనిపించింది టీజర్"కత్తితో జీవించేవాడు కత్తితో చనిపోతాడు - మత్తయి 26:52." అనే బైబిల్ నోట్ తో ముగుస్తుంది.
 
టీజర్ కేవలం పాత్ర పరిచయం కాకుండా,  సినిమాటోన్ ప్రిమైజ్ ని సెట్ చేస్తుంది. ఆకట్టుకునే విజువల్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ లు, ఎక్సయిటింగ్ రైటింగ్ తో  మంచి బజ్ ని క్రియేట్ చేసింది.
 
దీక్షిత్ శెట్టి ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్, శశి ఓదె, యుక్తి తరేజా వారి స్క్రీన్ ప్రెజెన్స్‌తో శాశ్వత ముద్ర వేశారు. నగేష్ బానెల్ ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ,  పూర్ణచంద్ర తేజస్వి ఇంటెన్స్ మ్యూజిక్  ఈ చిత్రానికి మరోస్థాయికి తీసుకెల్తాయి. శ్రావణ్ కటికనేని ఎడిటర్,  శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ, దసరా తర్వాత మిమ్మల్ని కలవడం ఆనందంగా వుంది. రెండేళ్ల తర్వాత అదే ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ. ఈ సినిమా కోసం టీమంతా చాలా ఎఫర్ట్ పెట్టాం. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలుగు ఆడియన్స్ నాలో ఉన్న టాలెంట్ ని అప్రిషియేట్ చేసి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మా టీజర్ ని లాంచ్ చేసిన నాని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు.  
 
డైరెక్టర్ కేకే మాట్లాడుతూ, ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మీరందరూ సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడుతాను. ఈవెంట్ కి వచ్చిన అందరికీ థాంక్యు సో మచ్'అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్