Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీకదీపం ఉమాదేవివి మాటలు కాదు బాబోయ్.. బూతుల బండ

Advertiesment
Karthika Deepam
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (21:27 IST)
Umadevi
బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమై వారం రోజులు పూర్తి కాగా ఇందులో మొదటి వారం ఎలిమినేట్‌లో బోల్డ్ బ్యూటీ సరయు ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఇక రెండో వారంలో అడుగు పెట్టగా మొదటి రోజే హౌస్ మొత్తం రచ్చ రచ్చ అయింది. బూతు మాటలతో బూతుల బాగోతమే చేసి అందరికీ షాక్ అయ్యేలా చేసింది ఉమాదేవి.
 
బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్‌లో అర్ధపావు భాగ్యంగా పేరు సంపాదించుకున్న ఉమాదేవి మొత్తానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-5లో అడుగు పెట్టింది. ఇక ఈ షోలో ఆమె మాటలను, ఆమె గొడవలను చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు. షో ప్రారంభం నుండి బాగా హైలెట్‌గా మారుతుంది ఉమాదేవి. ఇప్పటికే అందులో పలువురి కంటెస్టెంట్ లతో గొడవ పడుతూ ప్రేక్షకుల దృష్టిలో పడింది.
 
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ రౌండ్ జరగడంతో అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరిని నక్క, గ్రద్ద అంటూ 2 భాగాలుగా విడగొట్టాడు. ఇందులో ఉమాదేవి నక్క టీంలో ఉండగా అవతలి టీంలో ఉన్న పలువురు కంటెస్టెంట్‌లు ఉమా దేవిని నామినేట్ చేశారు. ఇక ఉమా మరోసారి తన పాత గొడవలు తీసింది. 
 
నాగార్జున ఇచ్చిన ఆలూ కర్రీని ఇంట్లో వాళ్లకి ఇవ్వలేదని చెప్పి ఉమా దేవిని నామినేట్ చేసాడు విశ్వ. దీంతో ఉమాదేవి కోపంతో రగిలిపోతూ.. నాగార్జున గారు నేనొక్కదాన్నే తినాలి అని అన్నప్పుడు మిగతా వాళ్లకు ఎందుకు ఇస్తాను అంటూ.. అలా ఇస్తే నా అంత వెర్రి* ఉండదు అంటూ బూతు మాట మాట్లాడింది.
 
దీంతో అక్కడున్న వాళ్ళందరూ ఒకే సారి షాక్ అవగా.. మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ మాత్రం నోరెల్లబెట్టి షాక్ అయ్యాడు. ఇక ప్రియాంక సింగ్ మాత్రం కిందపడి మరి నవ్వుకుంది. అంతటితో ఆ మాటతో రెచ్చిపోయిన ఉమాదేవి మరోసారి మరో బూతు మాటను వదిలింది. 
 
యానీ మాస్టర్, విశ్వలను నామినేట్ చేస్తూ.. దారుణంగా మాట్లాడేసింది ఉమా. దీంతో ఆ మాటలు విన్న తోటి కంటెస్టెంట్‌లు, ప్రేక్షకులు బాగా షాకయ్యారు. ఇక నెటిజన్లు ఇవి మామూలు మాటలు కాదు బాబోయ్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Leharaayi Song Promo... ముద్దుల వర్షంలో అఖిల్-పూజా హెగ్డే