Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇదంతా నా కర్మ: కన్నడ డ్రగ్స్ విచారణలో నటి సంజన కన్నీళ్లు

ఇదంతా నా కర్మ: కన్నడ డ్రగ్స్ విచారణలో నటి సంజన కన్నీళ్లు
, గురువారం, 10 సెప్టెంబరు 2020 (14:03 IST)
డ్రగ్స్ కేసులో నటి సంజనా ప్రమేయం ఉందంటూ విచారణలో బయటపడటంతో ఆమెను అరెస్టు చేశారు. డ్రగ్స్ వ్యవహారంపై ఆమెను అరెస్టు చేయడమే కాకుండా 5 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అరెస్టు అయిన నటీమణి రాగిణి ద్వివేది ఇద్దరినీ బెంగళూరు డైరీ సర్కిల్‌లోని మహిళా సాంత్వన కేంద్రంలో ఉంచారు.
 
ఐదు బెడ్లు ఉన్న ఒకే గదిలో ఆ చివర, ఈ చివర బెడ్లను ఇద్దరికీ కేటాయించారు. మధ్యలో మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. కాగా డ్రగ్స్ విచారణ సమయంలో సంజన ఇదంతా నా కర్మ అంటూ బోరున విలపించినట్లు సమాచారం. తను ఈ ఉచ్చులో ఇరుక్కోవడంపై రాగిడి, సంజనా ఇద్దరూ తీవ్ర మానసిక వేదనలో వున్నట్లు తెలుస్తోంది.
 
లాక్‌డౌన్ టైమ్‌లో ఫుడ్ డెలివరీ బాయ్స్ ద్వారా డ్రగ్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. డెలివరీ బాయ్స్‌ను పోలీసులు చెక్ చేయరని వారి ద్వారా సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారం కాస్తా కన్నడనాటలో పెద్ద చర్చే జరుగుతోంది. విచారణలో సంజన, రాగిణి ఇద్దరూ పలువురి పేర్లు చెప్పినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ వీడియో చూపించి అవకాశాలు రాకుండా చేస్తున్నారు.. కమల్‌పై తమిళ నటి ఫైర్