బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెకు మరోమారు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో కూడా ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
ఈ విషయాన్ని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యువేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. మొదటి పరీక్ష ఫలితంపై కనిక కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో వైద్యులు మరోసారి టెస్టులు చేశారు. కనికకు వైరస్ సోకిందని నిర్ధారించారు.
కనిక కుటుంబ సభ్యుల్లో చాలా మందికి వైరస్ సోకలేదని తెలిసింది. మొత్తం 35 మంది శాంపిల్స్ సేకరించగా, అందులో 11 మందికి నెగిటివ్ అని తేలింది. మరో 24 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇక, ఆసుపత్రిలో తనకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్న కనిక ఆరోపణలను వైద్యులు కొట్టిపారేశారు.