Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ ప్రియుడు కిరాయి ఇంట్లో ఉంటే.. నేను సొంతింటిలో ఉంటున్నా : కంగనా

Advertiesment
మాజీ ప్రియుడు కిరాయి ఇంట్లో ఉంటే.. నేను సొంతింటిలో ఉంటున్నా : కంగనా
, శుక్రవారం, 26 జూన్ 2020 (09:22 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డేరింగ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన భామ కంగనా రనౌత్. అటు హీరోయిన్‌గా ఇటు దర్శకురాలిగా రాణిస్తోంది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తుంది. అవి తీవ్ర చర్చనీయాంశాలుగా మారిపోతుంటాయి. అలా పలు వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌పై ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. తన మాజీ ప్రియుడు కిరాయి ఇంట్లో ఉంటే.. నేను సొంతంగా ఇల్లు నిర్మించుకున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆమె తాజాగా మాట్లాడుతూ, హృతిక్ రోషన్‌ తాను ప్రేమించుకుని విడిపోయినట్టు తెలిపారు. 'నేను డబ్బుల కోసం ప్రేమించానని హృతిక్‌ తన సన్నిహితుల వద్ద చెప్పేవాడు. గ్రామం నుంచి వచ్చాను కాబట్టి ఐశ్వర్యాన్ని చూసి అతని వెంటపడ్డానని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ మాటలన్నీ నాకు గుర్తున్నాయి. 
 
కానీ ఈరోజు నేను ఎంతో గర్వంగా ఉన్నా. నా మాజీ ప్రియుడు కిరాయి ఇంట్లో ఉంటే.. నేను సొంతంగా ఇల్లు కట్టుకొని, విలాసవంతమైన ఆఫీసు ఏర్పాటు చేసుకున్నా. హృతిక్‌ ఉంటున్న ఇళ్లు వాళ్ల నాన్న కట్టాడు. హృతిక్‌ ఒకప్పుడు నాపై చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. అందుకే కష్టించి పనిచేశాను. అందమైన ఆఫీసు, ఇల్లు  సమకూర్చుకున్నా. పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయిలు ఏ స్థాయికైనా చేరుకోగలరని నిరూపించా. నాకు యాభైఏళ్లు వచ్చేసరికి దేశంలో ధనవంతుల్లో ఒకరిగా ఉండాలనుకుంటున్నా. అవమానాలే నాలో ఎదగాలనే కాంక్షను రగిల్చాయి' అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో అజయ్ దేవగన్ పాత్ర ఇదేనా?