Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రిష్‌తో విభేదాల్లేవ్... రోజూ మాట్లాడుకుంటున్నాం : కంగనా రనౌత్

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడికి తనకు మధ్య విభేదాలు ఉన్నట్టు వచ్చిన వార్తలపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ స్పందించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవనీ తామిద్దరం రోజూ ఫోనులో మాట్లాడుకుంటున్నట్టు చెప్పుకొ

Advertiesment
Kangana Ranaut
, ఆదివారం, 26 ఆగస్టు 2018 (16:42 IST)
ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడికి తనకు మధ్య విభేదాలు ఉన్నట్టు వచ్చిన వార్తలపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ స్పందించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవనీ తామిద్దరం రోజూ ఫోనులో మాట్లాడుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
కాగా, క్రిష్ - కంగనాల మధ్య విభేదాలున్నాయని, ఇద్దరికీ గొడవ జరిగిందని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో వస్తున్న 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సి' చిత్రంలో కంగన టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. సగానికి పైగా చిత్రీకరణ పూర్తైంది. ఈ నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
దీనిపై తాజాగా కంగనా స్పందించారు. 'క్రిష్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న 'యన్‌టిఆర్' బయోపిక్‌ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ఆరోజు ఎలాంటి డేట్లు ఇవ్వలేదు. ఆగస్ట్‌ 15న మా సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యాక సినిమాను 2019 గణతంత్ర దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాం. ఈ నేపథ్యంలో రచయితలు మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు తెరకెక్కించాలని నిర్ణయించారు. నేను కూడా అందుకు ఒప్పుకొన్నాను. అంతేకానీ మేమిద్దరం ఏ విషయంలోనూ గొడవపడలేదు' అని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాసుల వర్షం కురిపిస్తున్న 'గీత గోవిందం'