Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తన కంటే మరో గొప్ప నటి మరొకరు లేరు : కంగనా రనౌత్

Advertiesment
తన కంటే మరో గొప్ప నటి మరొకరు లేరు : కంగనా రనౌత్
, బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:11 IST)
బాలీవుడ్ వివదాస్పద నటి కంగనా రనౌత్ మరోమారు మీడియాకెక్కారు. తనలాంటి నటి మరొకరు లేరంటూ వ్యాఖ్యానించారు. మూడు ఆస్కార్ అవార్డులు సాధించిన హాలీవుడ్ నటీమణి మెరిల్ స్ట్రీప్ కంటె గొప్ప నటినని, యాక్షన్ స్టార్ టామ్ క్రూస్ కంటే గొప్పగా స్టంట్లు చేయగలనని గొప్పలు చెప్పుకుంటూ ఓ ట్వీట్ చేయగా అది వైరల్ అయింది. 
 
ఈమె ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్‌ 'తలైవి'లోనూ, యాక్షన్‌ మూవీ 'థాకడ్'లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లూ చివరి దశకు చేరుకున్నాయి. ఈ రెండు సినిమాల పోస్టర్లనూ కంగన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ తన కంటే గొప్పనటి మరొకరు లేరని మురిసిపోయింది.  
 
"నా స్థాయిలో నటించగలిగే మరో నటి ప్రస్తుతం ఈ భూమి మీద లేదు. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన మెర్లీ స్ట్రీప్‌లో ఉండే ప్రతిభ నాలో ఉంది. అలాగే ఇజ్రాయిల్‌ ప్రముఖ నటి గాల్ గాడోట్‌లా యాక్షన్‌ చేయగలను. గ్లామరస్‌గానూ కనిపించగలన" అని కంగన ట్వీట్ చేసింది. కంగన చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. మీమ్‌లు, సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. 
 
దీంతో ఊపిరి పీల్చుకోలేని కంగనా మరోమారు స్పందించారు. 'నువ్వు ఎన్ని ఆస్కార్‌లు సాధించావు అని నన్ను అడుగుతున్న వారందరికీ ఒకటే ప్రశ్న.. మెరిల్ స్ట్రీప్ ఎన్ని జాతీయ అవార్డులు సాధించింది? ఎన్ని పద్మ అవార్డులు సాధించింది? ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. మీ బానిస మనస్తత్వం నుంచి బయటపడండి. మీ అందరికీ కాస్త ఆత్మ గౌరవం కావాల' అని పేర్కొంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు, నమ్రతల 15వ వివాహ వార్షికోత్సవం: వంశీ సెట్స్‌లో కలిసి..?