బాడీకి కసరత్తు ఇలా చేయాలంటున్న కామ్నా జెఠ్మలాని
, శనివారం, 6 మార్చి 2021 (23:32 IST)
నటి కామ్నా జెఠ్మలానికి ఖాళీ సమయం దొరికితే వ్యాయామానికి కేటాయిస్తుందట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్‌స్‌ట్రాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. మంచి వ్యాయామంతో వీకెండ్ ప్రారంభమైందని చెబుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో పంచుకుంది. జిమ్‌లో కసరత్తు చేస్తూ కనిపించింది. గతంలో కూడా జూన్‌లో రోప్ ఎక్సర్‌సైజ్ చేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. ఈసారి హ్యాండ్ బండిల్స్‌ను చేస్తూ, బెంచ్‌ప్రెస్‌చేస్తూ కనిపించింది.
అలాగే కాళ్ళకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌ను ఎలా చేయాలో చూపించింది. ఇవన్నీ అయ్యాక ఫుడ్ ఏ మేరకు తినాలో చెబుతోంది. తాను ఎప్పుడు ఎక్కువగా తిననని అంటోంది. కాగా, కామ్నా జెఠ్మలాని తెలుగులో ప్రేమికులు, బెండ్ అప్పారావు వంటి పలు సినిమాలు చేసింది. 2013లో సద్‌గురు ఆదిశంకరాచార్య చేశాక మరలా ఇంతవరకు నటించలేదు. కన్నడ, తమిళ్ సినిమాలు చేస్తోంది. తాజాగా కన్నడలో గరుడ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
తర్వాతి కథనం