Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

బాంబు పేల్చిన వర్మ : బాబును ఏకిపారేసిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' ట్రైలర్

Advertiesment
Kamma Rajyam Lo Kadapa Reddlu TRAILER
, ఆదివారం, 27 అక్టోబరు 2019 (11:33 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వివాదాస్పద, సంచలన దర్శకుడుగా గుర్తింపు పొందిన రాంగోపాల్ వర్మ తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈ చిత్రానికి సంబంధించిన మరో ట్రైలర్‌ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ద్వారా ఆయన బాంబు పేల్చారు. 
 
ఈ చిత్రానికి వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఇపుజు కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తిచేసుకుని, ఇతర డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. 
 
నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్‌ను బట్టి చూస్తే రెండు సామాజిక వర్గాల మధ్య నడిచే కథ ఇదని అనుకుంటారు. కాని అందులో నిజం లేదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపథ్యంలో కథ సాగుతుంది అని మేక‌ర్స్ అంటున్నారు. 
 
కాక‌పోతే సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న వివాదాస్పద అంశాల్ని స్పృశిస్తూ రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతున్నది. 
 
తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. వ‌ర్మ వాయిస్‌తో ట్రైల‌ర్ మొద‌లు కాగా, ఇందులోని స‌న్నివేశాల‌ని బ‌ట్టి చూస్తుంటే చిత్రంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాలు ఎలా మారాయో చూపించిన‌ట్టు తెలుస్తుంది. మీరు ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి. ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీకి షాకిచ్చిన ఉపాసన.. అలా ఎందుకు చేశావంటూ నిలదీత...