Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలం రాసిన కథలు సక్సెస్ సెలబ్రేషన్స్

Kalam rasina kathalu

డీవీ

, ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (13:56 IST)
Kalam rasina kathalu
యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం 'కాలం రాసిన కథలు.' నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో ఈ ఫిలిం యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
 
దర్శక నిర్మాతలు ఎం.ఎన్.వి సాగర్ మాట్లాడుతూ, "ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను. సినిమా విడుదక అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. మంచి రిలీజ్‌ని మాకు అందించినందుకు డిస్ట్రిబ్యూటర్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా విజయం నేను తదుపరి చేయబోయే సినిమాల మీద విశ్వాసాన్ని పెంచింది. ఈ సినిమాలో పెద్ద స్టార్స్ లేకున్నా, కొత్త వాళ్ళని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. 
 
ఈ చిత్రంలో అన్ని పాత్రలు ప్రేక్షకులకి దగ్గరయ్యాయి. ముఖ్యనగ, కిరాక్ కిరణ్ పాత్ర క్లైమాక్ లో బాగా పండింది. ఈ సినిమాలో చేసిన ముగ్గురు హీరోయిన్స్‌కి స్పెషల్‌గా థాంక్స్ చెప్తున్నాను. హన్విక తనకి ఇచ్చిన పాత్ర లో అందరినీ మెప్పించింది. ఉమా కూడా అద్భుతమైన నటన కనబరిచి బేబీ సినిమా లో వైష్ణవి ఛైతన్య లాగా, ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్‌పుట్ లాగా మెప్పించింది. రాబోయే వారాల్లో కూడా ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను." అన్నారు.
 
హన్విక శ్రీనివాస్ మాట్లాడుతూ, "నేను ఈ చిత్రం లో నవ్య అనే పాత్ర పోషించాను. ఈ పాత్రని చాలా బాగా రాసారు. సాగర్ గారు ఈ పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు ఆయనకీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను". ఇక్కడకొచ్చిన మీడియా వాళ్లందరికీ కూడా థాంక్స్." అన్నారు. ఉమా రేచర్ల మాట్లాడుతూ, "ఈ సినిమా లో నా కో-స్టార్స్ అభిలాష్, శ్రీధర్ నాకు బాగా సపోర్ట్ చేసారు. నేను కొత్త అయినా నన్ను ప్రేక్షకులు ఆదరించినందుకు సంతోషంగా ఉంది." అని చెప్పారు. 
webdunia
Kalam rasina kathalu
 
నటుడు వికాస్ మాట్లాడుతూ, "ఈ పాత్ర నాకు దక్కినందుకు చాలా అదృష్టంగా ఉంది. ఈ సినిమా మొదట నా దగ్గరకొచ్చినపుడు నేను చేయగలనో లేదో అనిపించింది కానీ సాగర్ గారు నాకు ధైర్యం ఇచ్చారు. మేమందరం సినిమా విజయం సాధించినందుకు సంతోషంగా ఉన్నాను." అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రీసెంట్‌ టైమ్స్‌లో బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం': మహేష్ బాబు