Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోమాలో ఉన్న వీరాభిమాని కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎన్టీఆర్

Advertiesment
కోమాలో ఉన్న వీరాభిమాని కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎన్టీఆర్
, గురువారం, 30 జూన్ 2022 (15:44 IST)
తెలుగుహీరో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఏమాత్రం తట్టుకోలేరు. వారిని ఏదో రూపంలో ఆదుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. తాజాగా ఓ వీరాభిమాని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కోమాలో చికిత్స పొందుతున్నాడన్న విషయం తారక్‌కు తెలిసింది.

ఆ వెంటనే ఆ వీరాభిమాని కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ఫోనులో మాట్లాడి ధైర్యం చెప్పారు. 'నువ్వు కోలుకుని రా. మనం త్వరలో కలుద్దాం' అంటూ అభిమానికి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు నెటిజన్ల మదిని హత్తుకుంటున్నాయి. అసలేం జరిగిందంటే..
 
జనార్ధన్‌ అనే ఓ యువకుడికి తారక్‌ అంటే అమితమైన ఇష్టం. ఎంతలా అంటే.. తన చేతిపై ఎన్టీఆర్‌ అని పచ్చబొట్టు వేయించుకుని మరి అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే ఇటీవల అతను రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లాడు. ఇతర అభిమానులు చెప్పడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న తారక్‌.. వెంటనే జనార్ధన్‌ కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. 
 
'జనార్ధన్‌కు ఏం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. అందరం కలిసి దేవుడ్ని ప్రార్థిద్దాం. నేనున్నా' అంటూ భరోసానిచ్చారు. అనంతరం జనార్ధన్‌ వద్దకు ఫోన్‌ తీసుకెళ్లమని చెప్పిన తారక్‌.. 'జనార్ధన్‌ నేను ఎన్టీఆర్‌ని మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా కోలుకుని రా. మనం త్వరలోనే కలుద్దాం. నీకోసం ప్రార్థిస్తున్నా. నీకోసం నేనున్నా.. మన అభిమానులున్నారు' అని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస‌లైన బ‌యోపిక్ రాకెట్రీ - రివ్యూ రిపోర్ట్‌