టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ 30, 31 సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మే 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాల నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వనున్నారనోనని ఆశగా ఎదరుచూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించింది. తాజాగా ఎన్టీఆర్ 30 మేకర్స్ క్రేజీ అప్డేట్ అందించారు.
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ 30 నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు మరో వీడియో బీట్ కూడా రానుందని ప్రచారం జరిగింది.
వీటన్నింటికి చెక్ పెడుతూ లేటెస్ట్‌గా ఎన్టీఆర్ 30 నుంచి అప్డేట్ అందించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అప్డేట్ అందిస్తూనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్‌లో ఎన్టీఆర్ లెఫ్ట్ హ్యాండ్‌తో రక్తపు మరకలతో ఉన్న కత్తిని పట్టుకుని కనిపిస్తున్నాడు.
బ్యాక్ గ్రాండ్‌ను పరిశీలిస్తే రాత్రి సమయంలో మేఘాలు కమ్ముకున్న వేళ వర్షం కురుస్తుండగా సాగే పవర్ ఫుల్ సీక్వెన్స్ లాగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ పోస్టర్ సినిమాపైనా ఆసక్తిని పెంచుతోంది. ఇక సాయంత్రం వచ్చే అప్డేట్ ఎలా ఉండబోతోందనని ఎగ్జైట్ ఫీలవుతున్నారు అభిమానులు.