టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల బరిలో ఉన్నాడనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రలో ఆయన జీవించారు. ఈ పాత్రకు ప్రతి ఒక్కరూ ఫిదా కావడమే కాకుండా, ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాంటి ఎన్టీఆర్ ఇపుడు ఆస్కార్ రేసులో ఉన్నారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అమెరికాలో పేరొందిన మూవీ పబ్లికేషన్ వెరైటీ ఎడిషన్ 2023 ఆస్కార్ నామినేషన్స్‌లో ఎన్టీఆర్ ఉండే అవకాశాలు ఉన్నట్టు సూచన ప్రాయంగా తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ఆస్కార్ బరిలో ఉన్న తొలి హీరోగా ఎన్టీఆర్ రికార్డుపుటలకెక్కుతాడని ఆయన అభిమానులు అంటున్నారు.