Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియాఖాన్‌ ఆత్మహత్య కేసు.. సూరజ్ పంచోలికి విముక్తి

Advertiesment
Jiah Khan
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (13:28 IST)
బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. పదేళ్ల తర్వాత ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. జియాఖాన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నటుడు సూరజ్ పంచోలి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిని.. ఈ కేసు నుంచి సీబీఐ కోర్టు విముక్తుడిని చేసింది. 
 
పరిమిత సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కోర్టు నిందితుడిగా పరిగణించలేదని.. కనుక నిర్ధోషిగా ప్రకటిస్తున్నామని జడ్జి ఏఎస్ సయ్యద్ తీర్పు తెలిపారు. హత్య అంటూ కేసు విచారణను జియాఖాన్ తల్లి జాప్యం చేశారని కోర్టు వ్యాఖ్యానించింది.
 
జియాఖాన్ 2013 జూన్ 3న ముంబైలోని తన నివాసంలో విగత జీవిగా బయటపడింది. ఆ సమయంలో ఆమె వయసు 25 ఏళ్లు. ఘటన జరిగిన వారం తర్వాత జియా రాసినట్టుగా భావిస్తున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా సెక్షన్ 306 కింద సూరజ్ పంచోలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్‌కు ఘనస్వాగతం పలికిన నందమూరి బాలకృష్ణ