Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీదేవి వర్ధంతి.. కుమార్తెల భావోద్వేగం.. సినీ సామ్రాజ్యపు పట్టపు రాణి ఇక వస్తుందా?

శ్రీదేవి వర్ధంతి.. కుమార్తెల భావోద్వేగం.. సినీ సామ్రాజ్యపు పట్టపు రాణి ఇక వస్తుందా?
, బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (23:10 IST)
sridevi
అతిలోక సుందరి శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమె కుమార్తెలు భావోద్వేగానికి లోనైయ్యారు. పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా శ్రీదేవి తనను ఉద్దేశించి స్వయంగా రాసిన ఓ పేపర్‌ను జాన్వీ పంచుకుంది. ‘ఐ లవ్యూ మై లబ్బు.. యువర్‌ ద బెస్ట్‌ బేబీ ఇన్‌ ద వరల్డ్‌’ అని శ్రీదేవి రాసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 
 
ఇక చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ కూడా తన తల్లిని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా బోనీకపూర్‌, శ్రీదేవి కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంది. మిస్‌ యూ అని జాన్వీ, ఐ లవ్యూ అమ్మ అని ఖుషీ కపూర్‌ అంటూ పోస్టులు చేశారు. 
webdunia
sridevi - jahnavi
 
ఇకపోతే.. బాలనటిగా తెరంగేట్రం చేసిన శ్రీదేవి దక్షిణాది భాషలన్నిటిలోనూ పోటీలేని మేటినటిగా ఎదిగి, బాలీవుడ్‌పైన దండెత్తి, జైత్రయాత్రలు చేసి, హిందీ చిత్రపరిశ్రమను చిత్తుచిత్తు చేసింది. మాస్ క్లాస్ ఆడియన్స్‌ని సరిసమానంగా గెలిచిన ఏకైక ఇండియన్ క్వీన్ శ్రీదేవి.
 
ఆమె అందుకోని అవార్డులు ఏ భాషలోనూ లేవు. అక్షరాల సినీసామ్రాజ్యాన్ని శాసించిన పట్టపు రాణి శ్రీదేవి. ఆమెను నమ్ముకుని నిర్మాతలు భారీగా డబ్బు సినిమాల్లో పెట్టేవారు. హీరోలు ఆమెతో చేయడానికి క్యూలు కట్టారు. దర్శకరచయితలు బారులు తీరారు. 
webdunia
Sri Devi
 
అలాంటి శ్రీదేవి హఠాత్తుగా ఎక్కడో దుబాయ్‌ హోటల్‌, బాత్రూం బాత్‌ టబ్‌లో 2018, ఫిబ్రవరి 24న మునిగి చనిపోయిందంటే భారతీయ సినిమా పరిశ్రమ ఇప్పటికీ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఆమె అభిమానులు అతిలోక సుందరి ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కైపు ఎక్కిస్తున్న సోనాల్‌!