Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.100 కోట్ల గ్రాస్‌తో రికార్డులు బ్రేక్ చేస్తోన్న జనతా గ్యారేజ్..

''జనతా గ్యారేజ్'' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. సరైన హిట్స్ లేక ఎన్టీఆర్ సతమతమవుతున్న తరుణంలో ''జనతా గ్యారేజ్''తో నిరూపించాడు. కేవలం విడుదలైన 8 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్

Advertiesment
Janatha Garage box office collection: Jr NTR film mints Rs 100 cr worldwide
, గురువారం, 8 సెప్టెంబరు 2016 (18:31 IST)
''జనతా గ్యారేజ్'' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. సరైన హిట్స్ లేక ఎన్టీఆర్ సతమతమవుతున్న తరుణంలో ''జనతా గ్యారేజ్''తో నిరూపించాడు. కేవలం విడుదలైన 8 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి తెలుగు సినిమా పరిశ్రమ రికార్డ్స్ బ్రేక్ చేసిన చిత్రంగా రెండో స్థానం దక్కించుకున్నాడు. 
 
ఇప్పటికే సినిమా యూనిట్ అంత సంబరాలు చేసుకుంటుంటే, ఎన్టీఆర్ వారందరి కంటే ఇంకా ఎక్కువ సంబరాలు చేసుకుంటున్నాడు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. బాక్సాఫీస్ దగ్గర జనతా సాధిస్తున్న వసూళ్లు ఆనందాన్ని కలిగిస్తున్నాయని తెలిపాడు.
 
ముందుగా చెప్పినట్టే ఈ నెంబర్ గేమ్‌కు తాను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనని చెప్పాడు. ఒక నటుడిగా మంచి సినిమాల్లో మంచి పాత్రలు చేయడమే తన లక్ష్యమని వెల్లడించాడు. ఇక అతి త్వరలోనే జనతా సక్సెస్ సంబరాలు చేసుకుందామని చెప్పాడు.

ఇంకేముంది.. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వరుస హ్యాట్రిక్ హిట్లతో ఎన్టీఆర్ కెరియర్ ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవరసరం లేదు.. సరైన కథ దొరికితే బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడని మరోసారి జనతా గ్యారేజ్‌‍తో నిరూపించుకున్నాడు.

టాలీవుడ్ టాప్ మూవీస్‌లలో గారేజ్ రెండోస్థానంలో చేరిపోవడంతో ఎన్టీఆర్‌తో సహా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు అభిమానులు ఇక టాలీవుడ్ నెంబర్ వన్ ఎన్టీఆర్‌అని అంటున్నారు. త్వరలోనే వైజా‌గ్‌లోలో సినీ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో మహేష్ బాబు-మురగదాస్ సినిమా: కష్టపడిపోతున్న ప్రిన్స్