Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమా టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసే పరిస్థితి లేదుగా: మహానటిపై జమున

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ''మహానటి'' చిత్రం ప్రస్తుతం ప్రముఖుల మన్ననలు పొందుతూ.. ప్రేక్షకుల ఆదరణతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి జమున స్పందించారు. సావిత్ర

Advertiesment
సినిమా టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసే పరిస్థితి లేదుగా: మహానటిపై జమున
, మంగళవారం, 15 మే 2018 (16:36 IST)
అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ''మహానటి'' చిత్రం ప్రస్తుతం ప్రముఖుల మన్ననలు పొందుతూ.. ప్రేక్షకుల ఆదరణతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి జమున స్పందించారు. సావిత్రి వంటి 'మహానటి' జీవితాన్ని తెరకెక్కించడం సాహసమేనని చెప్పాలి. జనానికి సినిమా బాగా నచ్చే వుంటుందన్నారు. 
 
సావిత్రితో వున్న అనుబంధం కారణంగా ఆమె జీవితంపై సినిమా రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని.. అలాంటి ప్రయత్నాన్ని చేసిన ఈ సినిమా యూనిట్‌కు.. సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్‌కు అభినందనలు తెలిపారు. 
 
పూర్వం ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే .. మా అందరినీ పిలిచి ప్రివ్యూ వేసి చూపించేవారు. ఇప్పుడు ఆ సిస్టమే పోయింది. మీరొచ్చి సినిమా చూశారా? అని అడిగితే నేను ఏం చెబుతాను? నేను సినిమా హాలుకి వెళ్లి టికెట్టు కొనుక్కుని సినిమా చూసే పరిస్థితి లేదుగా అంటూ నిట్టూర్చారు. కాగా, తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంటుంది. 
 
తెలుగు సినిమా చరిత్రలో తొలి బయోపిక్ మూవీ మహానటి చిత్రానికి తిరుగులేని విజయాన్ని అందించారు తెలుగు ప్రేక్షకులు. చాలా ఏళ్లుగా ఎందరో అగ్రదర్శకులకు సాధ్యం కాని ఫీట్‌ను మహానటి రూపంలో సాధ్యం చేసి చూపారు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న, ప్రియాంక దత్‌లు నిర్మించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోయిన్‌కు జక్కన్న మల్టీస్టారర్‌లో ఛాన్స్.. ఆ కథానాయిక ఎవరు?