Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరోతో ఓ రాత్రి గడిపితే 2 నిమిషాల రొమాంటిక్ పాత్ర ఇచ్చారు.. కంగనా

హీరోతో ఓ రాత్రి గడిపితే 2 నిమిషాల రొమాంటిక్ పాత్ర ఇచ్చారు.. కంగనా
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (11:59 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా మరోమారు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ దఫా కాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలతో మరింత సంచలనాన్ని కలిగించింది. పార్లమెంట్‌లో జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ ఇచ్చిన కంగన, చిత్ర పరిశ్రమకు స్త్రీవాదాన్ని నేర్పింది తానేనని అన్నారు.
 
అంతటితో ఆగకుండా, 'సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే వచ్చాయి. మంచి పాత్రలు రావాలంటే, హీరోలతో సన్నిహితంగా ఉండాలి. తప్పదనుకుని నేను కూడా ఓ హీరోతో సన్నిహితంగా ఉన్నా. దీని ఫలితంగా రెండు నిమిషాల నిడివితో ఉన్న ఓ రొమాంటిక్ పాత్ర లభించింది. ఆపై ఐటమ్ నంబర్స్... ఆదిలో నన్ను శృంగారపరంగానే చూపించేవారు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం జయాబచ్చన్ ఏమీ కాదని, మంచి కథలను ఎంచుకోవడమేనని చెప్పుకొచ్చారు. తనకు రాజకీయ పార్టీలో టికెట్ పొందటం పెద్ద కష్టమైన పనేమీ కాదని తెలివైన వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని కంగన వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, తన కలలు, ఆశలు, శక్తిసామర్థ్యాలు, భవిష్యత్‌ను బృహన్‌ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) రేప్‌ చేసిందని కంగన ఆరోపించారు. కంగన ఇంట్లో అదనంగా నిర్మించిన ఆఫీసును అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె రూ.2 కోట్ల నష్టపరిహారం కోరుతూ ముంబై హైకోర్టులో కేసు వేశారు. 
 
ఈ సందర్భంగా నటి ఊర్మిళపై కూడా కంగన మండిపడ్డారు. బీజేపీలో టికెట్‌ కోసమే కంగన ఇలా చేస్తోందన్న ఊర్మిళ కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు. 'నాకు రాజకీయ పార్టీలో టికెట్‌ పొందడం అంత కష్టమేమీ కాదని తెలివైన వాళ్లకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన వల్ల కాకుండా శృంగారతారగానే ఊర్మిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అలాంటి ఆమే టికెట్‌ పొందితే.. నేను ఎందుకు పొందలేను' అంటూ కంగనా రానౌత్ ట్వీట్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్.. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారా? గంగవ్వ వెళ్ళిపోతుందా?