Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏ.ఆర్. రెహ్మాన్‌కు ప్రతిష్టాత్మక జర్మనీ పురస్కారం

Advertiesment
Indian Superstar
, మంగళవారం, 31 మే 2016 (14:31 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి ఎన్నోఅవార్డులను తన వంశం చేసుకున్నారు. తాజాగా ఫుకౌకా ప్రైజ్ 2016 అవార్డును ఆయన సొంతం చేసుకున్నాడు. జపాన్ అందించే ప్రతిష్టాత్మకమై గ్రాండ్ ఫుకౌకా ప్రైజ్‌కు రెహ్మాన్‌ను ఫుకౌకా ప్రైజ్ కమిటీ నామినేట్ చేసింది. 
 
తన మ్యూజిక్ ద్వారా దక్షిణాసియా దేశాల సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పినందుకుగాను ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా ఫుకౌకా సిటీలోని యొకాతోపియా ఫౌండేషన్ ఈ అవార్డులను ప్రతి ఏటా బహుకరిస్తుంది. ఆసియా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడిన వ్యక్తులకు, సంస్థలకు, గ్రాండ్ ప్రైజ్, అకాడమిక్ ప్రైజ్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రైజ్ అనే మూడు కేటగిరిలలో వీటిని అందజేస్తారు. మనదేశానికి చెందిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ 2015లో అకడమిక్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ అంత పని చేశాడా...? పరువు పోయిందా..? ఏం జరిగింది...?