ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు ఆర్.ఆర్.ఆర్., రాథేశ్యామ్ వంటి సినిమాలు ఒమిక్రాన్ వల్ల థియేటర్లు లేకపోవడం, కొన్ని చోట్ల కర్ప్యూ వంటివి జరగడంతో వాయిదా పడ్డాయి. ఇదే సమయంగా భావించిన చిన్న, మధ్యతరగతి సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. తమకు ఇదే సరైన సమయం అని భావించి వారంతా ముందుకు వస్తున్నారు. దాదాపు ఏడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.
ఇలాంటి సమయంలో బంగార్రాజు వంటి సినిమా రావడంతో చిన్న సినిమాల నిర్మాతలు థియేటర్ల సమస్యతోపాటు తాము ఊహించినట్లుగా కలెక్షన్లు రావనే భయపడుతున్నారు. ఇలాంటి టైంలో మీరు షడెన్‌గా జనవరి 14కు రావడం కరెక్టేనా అని నాగార్జునను ఓ విలేకరి అడిగాడు. దానికి నాగార్జున స్పందిస్తూ, మేము మొదటినుంచి సంక్రాంతికి రావాలనుకున్నాం. అలానే అన్ని కలిసి వచ్చాయి. అందుకే షడెన్‌గా నిన్ననే డిసైడ్ చేసుకున్నాం. ఇలా సంక్రాంతికి నాలుగైదు సినిమాలు రావడం మామూలే. నాకు చాలా సందర్భాల్లో ఐదు సినిమాలు వచ్చిన విషయం తెలుసు అని పేర్కొన్నారు.
పైగా. ఆర్.ఆర్.ఆర్. రాధేశ్యామ్ వున్నా మా బంగార్రాజును విడుదల చేసేవాళ్ళం అంటూ ట్విస్ట్ ఇచ్చారు.