రెబల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవిలతో సినిమా వుంది. అది త్వరలో తెలియజేస్తానని దర్శకుడు మారుతి వెల్లడించారు. ఏ సినిమా చేసినా నాకంటూ ఓ ఫార్మెట్ వుంటుంది. దానిని బట్టే సినిమా తీస్తాను. ఓ చోట చెఫ్‌కు ఇండియన్ వంట బాగా వచ్చు. ఆయనకోసం అందరూ అక్కడికే వెళతారు. కానీ కొత్తగా ప్రయోగం చేశాను చైనీస్ వంటకం వండాను. తినమంటేఎవ్వరూ తినరు. రారు కూడా. అలాగే పలానా చోట ఇడ్లీ బాగా చేస్తాడు అని తెలిస్తే ఇడ్లీ కోసమే జనాలు వెళతారు. ఇడ్లీలు చేసే వాడికి బోర్ కొట్టి ఇడ్లీ బదులు బజ్జీలు వేసినా జనాలు వెళ్ళరు. నేను కూడా అంతే. ప్రభాస్, చిరంజీవిలకు కథను చెప్పాను. వారికి నచ్చింది. నాకు నచ్చిన వంటకంలా సినిమా చేస్తాను.
వారి సినిమాలు ఎలావుంటాయనే ప్రశ్నకు మారుతీ పైన ఉదాహరణాలు వెల్లడించాడు నా నుంచి చిరంజీవిగారికి, ప్రభాస్‌కు నా నుంచి ఎటువంటి సినిమా రాబట్టుకోవాలో వారికి తెలుసు. దానికి అనుగుణంగానే సినిమా చేస్తాను. పెద్ద సూపర్ మార్కెట్‌లో వేల రూపాయలు ఖరీదుచేసే వస్తువులు అమ్ముతారు. అందులోనూ బబుల్‌గమ్ కూడా అమ్ముతారు. ఇంత పెద్ద మార్కెట్ బబుల్‌గమ్ అమ్మడం ఏమిటి? అనేది భావించకూడదు. అలాగే నా దగ్గర స్టఫ్ వుంది. పెద్ద సినిమాలు చేయగలను. చిన్న సినిమాలు చేయగలను. నేను చేసిన `మంచిరోజులు వచ్చాయ్` అనే సినిమా బబుల్‌గమ్‌లాంటి సినిమా అంటూ క్లారిటీ ఇచ్చాడు మారుతీ.